Shatamanam Bhavati

వధువేమో అలమేలు, వరుడట శ్రీవారు
మనువాడి కలిసారు
చెలిమి, కలిమి ఒకరికొకరు
ఈ జంటను దీవించగ
దేవతలందరి నోట పలికెను చల్లని మాట
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి

మీసకట్టు, కుంకుమ బొట్టు
కంచి పట్టు పంచే కట్టు
అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ
తను తన తాళిబొట్టు, ఆమె తన ఆయువు పట్టు
ఎకమైంది దాపత్యము ఏడడుగులు వేస్తూ
నాలో సగం నీవంటూ
నీలో సగం నేనంటూ
జనుమలు జతపడు వలపుగ
ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు
శతమానం భవతి
శతమానం భవతి

అందగాడు, అందరివాడు
అందుబాటు బంధువు వీడు
రేవు పక్క రేపల్లెకు నచ్చిన చెలికాడు
పంచదార నవ్వుల వాడు... పాతికేళ్ళ పండుగ వీడు
తాతయ్యకు, నానమ్మకు నమ్మిన చేదోడు
ఉగ్గుపాలే గోదారై
ఊపిరి గాలే గోదారై
గల గల పరుగుల కలలుగ
అలలెగసిన తన వయసుకు, నలుపెరుగని పసి మనసుకు
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి



Credits
Writer(s): Mickey J Meyer, Ramajogaiah Sastry
Lyrics powered by www.musixmatch.com

Link