Sri Saradamba

శ్రీ శారదాంబా నమోస్తుతే
శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే
శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే
శ్రీ శారదాంబా నమోస్తుతే

నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం
నాద సాధనే ఆరాధనం రాగాలాపనే ఆవాహనం
గళపీఠమే రత్న సింహాసనం
గళపీఠమే రత్న సింహాసనం సరిగమల స్వరసలిల సంప్రోక్షణం
శ్రీ శారదాంబా నమోస్తుతే

నా గానమే నీరాజనం నా ప్రాణమే నివేదనం
నా గానమే నీరాజనం నా ప్రాణమే నివేదనం
శ్వాసకీవిలా స్వరనర్తనం
శ్వాసకీవిలా స్వరనర్తనం సంగీత భారతికి సంకీర్తనం
శ్రీ శారదాంబా నమోస్తుతే
వాగీశా వల్లభ శ్రీ శారదాంబా
శ్రిత సరసిజాసన స్మిత మంగళానన శ్రీ శారదాంబా
సిద్ది ప్రదాయని బుద్ది ప్రసాదిని గీర్వాణి వీణాపాణి శ్రీ శారదాంబా
లలిత లయ జనిత మృదుల పద గమిత
లలిత లయ జనిత మృదుల పద గమిత కావ్య గాన లోల శంకర అచ్యుతాది సకల తిమిర సన్నుత
శ్రీ శారదాంబా నమోస్తుతే సంగీత సాహిత్య మూలాకృతే
శ్రీ శారదాంబా నమోస్తుతే నమోస్తుతే



Credits
Writer(s): K V Mahadevan, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link