Yemani Cheli

ఏమని నే చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో
తోటలలో పొదమాటులలో తెర చాటులలో

ఏమని నే మరి పాడుదునో
తికమకలో ఈ మకతికలో

నవ్వు, చిరునవ్వు విరబూసే పొన్నలా
ఆడు నడయాడు పొన్నల్లో నెమలిలా
పరువాలే park-uల్లో
ప్రణయాలే పాటల్లో
నీ చూపులే నిట్టూర్పులై నా చూపులే ఓదార్పులై
నా ప్రాణమే నీ వేణువై నీ ఊపిరే నా ఆయువై
సాగే తీగసాగే రేగిపోయే లేత ఆశల కౌగిట

ఏమని నే మరి పాడుదునో
తికమకలో ఈ మకతికలో

చిలకా గోరింకా కలబోసీ కోరికా
పలికే వలపంతా మనదేలే ప్రేమికా
దడపుట్టే పాటల్లో నీ దాగుడు మూతల్లో
ఏ గోపికో దొరికందని ఈ రాధికే మరుమోయనా
నవ్విందిలే బృందావనీ నా తోడుగా ఉన్నావని
ఊగే తనువులూగే వణకసాగే రాసలీలలు ఆడగ

ఏమని నే మరి పాడుదునో
తొలకరిలో తొలి అల్లరిలో మన అల్లికలో

ఏమని నే చెలి పాడుదునో
తికమకలో ఈ మకతికలో



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link