Ramachakkani Sitha

నీలగగన ఘనవిచలన ధరణిజా శ్రీరమణ

మధుర వదన నళిన నయన మనవి వినరా రామా

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట
రామచక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే

ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో
రామచక్కని సీతకి

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే

చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామచక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా

నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట
రామచక్కని సీతకి

ఇందువదన కుందరదన మందగమన భామ

ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ



Credits
Writer(s): Veturi, K M Radha Krishnan
Lyrics powered by www.musixmatch.com

Link