Teppalelli Poyaaka

తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తైయితే దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా
ఇంటి వాకిలి వెతికి ఆకాశం
చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో
మరిగే
శోకం
అంతా
నేడు తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా

వన్నెల చిన్నెల నీటి ముగ్గులే
బుగ్గపై కన్నులే వేయ
ఇంకను తప్పదా పోరాటం
ఈడనే ఆడను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
నేనో
నదిని
చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే

నేడు తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా

నేస్తమా నేస్తమా నీకోసం
గాలినై వచ్చినా నేడు
పువ్వులో తేనెలా నీరూపం
గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడువుండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై
కోరి
శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా

నేడు తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తైయితే దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా
ఇంటి వాకిలి వెతికి ఆకాశం
చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో
మరిగే
శోకం
అంతా



Credits
Writer(s): A.r. Rahman, Bhuvana Chandra
Lyrics powered by www.musixmatch.com

Link