Nijamaa Kaada

నా పాట వెలిగెను నీలో నిజమా కాదా
నా ప్రేమ పలికేను నీలో నిజమా కాదా

నా పాట వెలిగెను నీలో నిజమా కాదా
నా ప్రేమ పలికేను నీలో నిజం కాదా

ఇన్నాళ్లు ఎంతో అలసి
ఈనాడు నిన్నే కలిసి
మెరిసిందిలే మనసే
మనసంటే ఏంటో తెలిసి
తెలిసే అది నీతో తిరిగి
తిరిగిందిలే మలపే

నా పాట వెలిగెను నీలో నిజమా కాదా
నా ప్రేమ పలికేను నీలో నిజంకాదా

ఎలా వెన్నెలల్లే చేరుకుంది వేడుకా
ఎలా దాచుకున్నా దాగనంది కోరికా
నా చూపు వెతికెను నీకై నిజమా కాదా
నా రేపు బ్రతుకువు నువ్వై నిజమా కాదా

నాలో చిన్ని చిన్ని ఆశలే రాగాల తీగలే
భావాల నీతో పోలే గీతాల మాలలే
అవి నిన్నే నిన్నే కోరెనే
నీ చెంత చేరెనే
నిశ్చింతలోన నేడు నిదరలోన జారానే

నువ్వే నా హాయి దిగులు
నీకోసం రేయి పగలు కంటున్నానే కలలు
నాకన్నా నిన్నే నేడు నమ్మాను అంటున్నాను
వింటున్నవా ఆ కబురే
ప్రేమంటే తేలికా కాదే నిజమా కాదా
కాదంటే ప్రేమను నిజమే నిజమా కాదా

నా పాట వెలిగెను నీలో నిజమా కాదా
నా ప్రేమ పలికెను నీలో నిజమా కాదా



Credits
Writer(s): Jeet Ganguly, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link