Merupaisagara

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా
వెనకడుగే వేయక ముందుకు సాగరా
నలుదిక్కులు నవ్వుతు ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై
ఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి ని యుక్తి గ చూపెయ్
నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా
ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు నిండుగా మురిసేను రా మీ అమ్మ ఎక్కడున్నా
చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం
చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం
నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం
ప్రతి అణువై కావాలి నీ వెనుక సైన్యం
లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా

కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి
అలలతో పోటి పడి చేరాలి కలల కడలి
పందెమేది అయినా నీ పట్టుదలను చూసి
ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి
అందరికి చేతుల్లో ఉంటుంది గీతా
నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత
నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి
లోకాలే పొగిడేలా చూపించు ఘనత
లేరా చిందెయ్ రా విజయం నీదేరా

మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా
నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా



Credits
Writer(s): Mani Sharma, Ramesh Naidu Dasari
Lyrics powered by www.musixmatch.com

Link