Cheli Soku

చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు
వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళే నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు
కవి కాళిదాసుననుకోకు
వలవేసి వెంటపడకు

ఱన్నానంటే ఱన్నానంటావ్
ఱంతేగాని ఆలోచించవ్
నేనేకాదా నీకుండే దిక్కు
నాకోసం నువు పుట్టానంటావ్
నేనంటే పడి చస్తానంటావ్
నీకేంటంటా నా పై ఈ హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవేందుకు
పొమ్మంటూ దూరం చేస్తావేందుకు
చేప్పిందే మళ్ళి మళ్ళి చెప్పకూ
నన్నిట్లా నానా హింసపెట్టి చంపకు
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు

దగ్గరకొస్తే భగ్గంటున్నావ్
పక్కకుపోతే భయపడుతున్నావ్
ఇట్టాగైతే ఎట్టాగేమరి
ఆవైపంటే ఈవైపంటావ్
నే left ఱంటే నువు right ఱంటావు
నీతో ఱన్నీ పేచీలే మరి
ఆ పాదం కందేలాగా పరుగులేందుకే
నీ భారం నాకే ఇవ్వకా
మాటల్తో మంత్రం వేస్తూ తీయ్యగా
మైకంలో ముంచేస్తావు మెల్లమెల్లగా
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు
వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళే నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link