Okariki Okarye

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే
అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా కాదంటారా

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే

దిగులే పుట్టిన సమయంలో
ధైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో
తిడుతూనే వేడుకుంటే
కష్టం కలిగిన ప్రతిపనిలో
సాయం చేస్తుంటే
విజయం పొందిన వేళలలో
వెను తట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకుంటే
లోపాలను సరిచేస్తుంటే
ఆటా పాటా ఆనందం
అన్నీ చెరి సగమౌతుంటే
ప్రేమంటారా కాదంటారా

ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే

ఓ మనోహరీ చెలీ సఖీ
ఓ స్వయంవరా దొరా సఖా
మనసు నీదని మనవి సేయనా సఖీ
బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా
నినుచూడలేక నిమిషమైన
నిలువజాలనే సఖీ సఖీ
నీ చెలిమి లేని క్షణములోన జగతిని
జీవింపజాలనోయ్ సఖా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నటనకు జీవం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
అటుపై శెలవని వెళుతుంటే
నీ మనసే కలవర పడుతుంటే
ప్రేమంటారా జౌనంటాను



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link