Reddy Ikkada Soodu

వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిన్ను మరువగలేములే
(వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా)

(రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తీ సలవా జూడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు
వరసా కలిపే నేడు కురసా రైకల తాడు
సరసాకు పిలిచి కట్టు పసిడి పుస్తెల తాడు)

వేట కత్తికి మీసం పెడిదే నాకులాగే ఉంటాది
పూల బొత్తికి ఓణీ చుడితే నీకుమల్లే ఉంటాది
నువ్వునేను జోడి కడితే సీమకే సెగ పుడతాది
Already నేన్ ready అంటాందే నా తాకిడి
మోజుగా మోతగా కూసిందే కోడి
Shirt గుండీ ఫట్టనేలా చేసేయ్ హడావిడీ
ఏటవాలు సూపులతోనా కెలకమాకే scentబుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క యెలగనీ సాంబ్రాణికడ్డి
ఎడు గిరగిరలోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

(రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తీ సలవా చూడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు)

(రాజా సారంగుడంటే అచ్చంగ వీడే
రంగార సింగమల్లె దూకాడు చూడే
దూకాడు చూడే)

అందమంతా గంధకమై రాజేస్తాన్దే రాపిడి
హే సూర్యకారమ సూపులతో ముట్టిస్తా వేడీ
సిసలైన బొండుమల్లె పూల రాయుడోరి బండి
పైటాకు పచ్చ జండా చూసి ఆనకట్టు గండి
ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీకిది
Top-uగా ఉన్నాకదా చెప్పుకొ ఇబ్బంది
నుదుటి బొట్టున చమట బొట్టై వేసెయ్ తడీ ముడి

భలె భలె ఏటవాలు సూపులతోనా గెలకమాకే scentబుడ్డి
పట్టు పరుపుల పందిరి పక్క యెలగనీ సాంబ్రాణికడ్డి
అహ ఏడు గిరగిరలోపే ఇంట్లో తిరుగుతాడు చంటి రెడ్డి

(రెడ్డీ ఇక్కడ సూడు ఎత్తీ సలవా జూడు
చొరవ కలిపి పిలిచే కలికి పచ్చల ఈడు
వరసా కలిపే నేడు కురసా రైకల తాడు
సరసాకు పిలిచి కట్టు పసిడి పుస్తెల తాడు)



Credits
Writer(s): Sai Srinivas Thaman, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link