Amma Aavu

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమత చదివా ఈనాడు
ఇంక ఏదో చదవాలంటూ పెదవి కోరుతోంది
భలేగా కొత్త చదువు చదువు
ఇల నా ముద్దు కవిత చదువు
చెలి మురిపాల కథలు చదువు

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమత చదివా ఈనాడు

అ ఆ ఇ ఈ అక్షరాలకు కొత్త మాటలే చెప్పనా
చెప్పుకో త్వరగా చెప్పుకో
అ అంటే నీపై అభిమానం
ఆ అంటే నీతో ఉంటే ఆనందం
ఇ అంటే ఇలలో ఇద్దరమే
అలాగా
ఈ అంటే నువ్వు నేను ఈడు జోడే
ఎంత ముద్దుగా చెప్పావు
ఎంత ముద్దుగా చెప్పావు
పిచ్చి పిచ్చిగా నచ్చావు

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమత చదివా ఈనాడు

ఒకటి రెండు మూడు నాలుగుకు అర్ధమేమిటో చెప్పనా
చెప్పుకో, త్వరగా చెప్పుకో
ఒకటంటే ఒకటిగ అడుగేద్ధాం
అడుగేద్ధాం
రెండంటే రెండు గుండెలను ముడి పెడదాం
ముడి పెడదాం
మూడంటే మూడు ముళ్ళేసి
ఆ తర్వాత
నాలుగు కాలాల పాటు కలిసుందాం
ఐదు అంటే నే చెబుతాను
ఐదు అంటే నే చెబుతాను నా పంచ ప్రాణాలు నువ్వేగా

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమత చదివా ఈనాడు
ఇంకా ఏదో చదవాలంటూ పెదవి కోరుతోంది
భలేగా కొత్త చదువు చదువు
ఇల నా ముద్దు కవిత చదువు
చెలి మురిపాల కథలు చదువు

అమ్మ ఆవు ఇల్లు ఈగ చదివా ఆనాడు
ప్రేమ వలపు మనసు మమత చదివా ఈనాడు



Credits
Writer(s): K S Chandra Bose, Rabindra Prasad Pattnaik
Lyrics powered by www.musixmatch.com

Link