Na Rakthamtho

నా రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u
Petrol ధర పెరిగింది diesel ధర పెరిగింది
నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టే
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u

రిక్షా టైరు వోలే మన బతుకులు అరిగిపాయే
రేలారే రేలా రేలా రేలా
చక్రాల్లో బార్సులోలె మన గుండెలు కరిగిపాయే
రేలారే రేలా రేలా రేలా
మన కండలు నలిగిపోయి సీటు కింద దిండులాయే
రేలారే రేలా రేలా రేలా
రిక్షాలో ఆయిలోలె మన నెత్తురు ఒడిసిపాయే
రేలారే రేలా రేలా రేలా
ఎన్నాళ్ళు ఈ బతుకులు మెతుకు లేని మన బతుకులు
ఎన్నాళ్ళు ఈ బతుకులు మెతుకు లేని మన బతుకులు
బతుకు కొరకు బలిసినోళ్ళ టైరు కింద తోసి తొక్కు
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u

తొక్కి తొక్కి నా ఊపిరితిత్తులన్నీ చెడిపాయే
రేలారే రేలా రేలా రేలా
దగ్గి దగ్గి బొమికిలన్నీ పుచ్చిపోయి జల్లెడాయె

గుడ్లు పండ్లు మంచి తిండి తినమని డాక్టరు చెప్పే
గుడ్లు పండ్లు మంచి తిండి తినమని డాక్టరు చెప్పే
తిండే దొరకకపోతే మంచి తిండికేడబోను
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u

దొర బండ్లకు insurance దొర కార్లకు insurance
రేలారే రేలా రేలా రేలా
దొర పక్కకి insurance దొర కుక్కకి insurance
రేలారే రేలా రేలా రేలా
మార్వాడి సేటు గాని బీరువాకు insurance
మార్వాడి సేటు గాని బీరువాకు insurance
అల్సేషన్ కుక్క కన్నా అద్వానం మన బతుకులు ఛ
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u

దొర అని మేమంటే అరె తురె అంటాడు
రేలారే రేలా రేలా రేలా
వీపు మీద కాలు పెట్టి తొయ్యరా నా కొడుకంటడు
రేలారే రేలా రేలా రేలా
గాలిలోన ఎగిరి దుంకే ఏరోప్లేన్లు ఎన్నున్నా
రేలారే రేలా రేలా రేలా
జయ్యన ఉరికేటి జోరుదారు కార్లున్నా
జయ్యన ఉరికేటి జోరుదారు కార్లున్నా
మనిషిని మనిషే మోసే మనిషి బతుకు మారలేదు తూ
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u

ఎన్నికల season లో దొంగ నా కొడుకులంతా
రేలారే రేలా రేలా రేలా
రిక్షా రిక్షాల మధ్య కక్షలు పెంచేస్తారు
రేలారే రేలా రేలా రేలా
రిక్షా గుండెల మీద జెండా గట్టి పోతారు
రేలారే రేలా రేలా రేలా
చెప్పులోలె వాడుకొని తుప్పున మీదుంచుతారు
రేలారే రేలా రేలా రేలా
రిక్షాలిప్పిస్తమని గుడిసెలు ఏపిస్తమని
రిక్షాలిప్పిస్తమని గుడిసెలు ఏపిస్తమని
అందని మిఠాయి చూపి బందలోన తోసి పోతరు
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u
Petrol ధర పెరిగింది diesel ధర పెరిగింది
నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టే
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షాకు petrol-u
నా రక్తమే నా రిక్షాకు petrol-u
నా రక్తమే నా రిక్షాకు petrol-u



Credits
Writer(s): Vandematharam Srinivas, Gaddar
Lyrics powered by www.musixmatch.com

Link