Mounalu Elane

మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి

అల్లరి చేసే పువ్వుల మొక్కను చూశా
రహస్యముగానే మదినే తొవ్వి పదిలం చేసి వేశా
నిన్ను చూసి ఈడే కోరుకుంది తోడే
నన్ను వీడి విడిగా విడిపోయే నీడే
అరె మెరిసే మెరుపా నక్షత్రాల తలుకా ఎగిరిరావే నా చిలకా
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి

ఆ. వానకు అర్దం ఒక చినుకే నా చెలియా
నువ్వు ఒంటరి చినుకా నీటి వరదా నిజమును చెప్పవే సఖియా
బుగ్గసొట్టలోనా చిక్కుకొంటి మైనా కొప్పుముడి వలన తప్పుకొంటి లలనా
అరె చందనాల చనుకా మల్లెపూల మొలకా
సిగ్గువీడి రా వెనుకా
ఆగమంటు ఖండించి లోలోపల దండించి
చెప్పమంటూ అర్దించి చెప్పకుండ వంచించి
మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే
వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కథలోకి అరుదించి

సాహిత్యం: ఏ.యమ్.రత్నం & శివ గణేష్: హరిహరన్

Credits
Writer(s): Siva Ganesh, Vidya Sagar, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com

Link