Emai Poyave (From "Padi Padi Leche Manasu")

ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే

నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే
నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేశావే
నిను వీడిపోనంది నా ప్రాణమే
నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే
సగమే నే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా
పోనే లేనే నిన్నొదిలే
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే

ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే
నే లేని చోటే నీ హృదయమే
నువ్వు లేని కల కూడా రానే రాదే
కలలాగ నువ్ మారకే
మరణాన్ని ఆపేటి వరమే నీవే
విరహాల విషమీయకే

ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే



Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com

Link