Ninnu Maruvalenu

చెలియా, నన్ను చేరవా నాతోటి రావా
పక్కనే నువ్వులేని జన్మ ఎందుకు
ఎందుకు ఈ జన్మ నాకెందుకు, ఎందుకు?

నువ్వు నన్నే విడిచి అన్నీ మరిచి గాయం ఏదో చేసి
గుండెకోసి వెళ్ళిపోతుంటే
ప్రాణమున్నా లేని రాయిలాగా మారి నిన్నే చూస్తూ ఉన్నానే
నన్ను చూసాకైనా నీలోఉన్న జ్ఞాపకాలు లేచి నావైపే నిను నడిపిస్తాయని
ఆశ పెంచుకుని వేయికళ్ళతోనే చూస్తూ నీకై వేచి ఉన్నానే

ఓ చెలియా
ఓ సఖియా
నీ ఊహలోన బ్రతికి చేరుకోనా చితికి ఆవిరయ్యి ప్రేమకి
ఈ గాలిలోన కలిసి శ్వాసలాగ నిలిచి నీకు కానా ఊపిరి
నిన్ను మరువ మరువ మరువ మరువ మరువ మరువలేను
నిన్ను కలువ కలువ కలువ కలువ కలువ లేను
నిన్ను మరువలేను కలువలేను
ఇంకా పేరుపెట్టి పిలువలేను
ప్రేమా ఎప్పటిలా నిను చూడలేను నీ జంటై నే నడువలేను
ఇకపై ఎపుడూ రేయి పగలు హాయి దిగులు ఏదైనాను
నీతో నే చెప్పలేను బంధం ఉన్నా సొంతం కాలేను

ఈ ప్రణయం కథ
మనసులోన అది ప్రసవం కదా ఎపుడూ
ప్రేమికులకే కడు శోకం కాదా
ఎదలను చేరగనే కానరాదు అది తన జన్మతహ
నైజం, అనదా

చెలియా చెలియా వలపే వలయా
నిన్ను మరువ మరువ మరువ మరువ మరువమరువ లేను (నిన్ను మరువ మరువ)
నిన్ను కలువ కలువ కలువ కలువ కలువ లేను (నిన్ను కలువ కలువ)
నిన్ను మరువలేను కలువలేను (నిన్ను మరువ, కలువ)
నీ పేరే ఎదలో చెరుపలేను



Credits
Writer(s): Phani Kalyan
Lyrics powered by www.musixmatch.com

Link