Om Namaha

ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో
రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా
కాలము లేనిదై గగనము అందగా
సూరీడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళ
ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం
ఒంటరి బాటసారి జంటకు చేరరా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి ఓం
ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం
ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

సాహిత్యం: వేటూరి

Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link