Manasu Palike

మనసు పలికే
మనసు పలికే
మౌనగీతం
మౌనగీతం
మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే
మమతలొలికే
స్వాతిముత్యం
స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు

మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే స్వాతిముత్యం నీవే

శిరసుపై నీ గంగనై మరుల జలకాలాడనీ
మరుల జలకాలాడనీ
సగము మేన గిరిజనై పగలు రేయి ఒదగనీ
పగలు రేయీ ఒదగనీ
హృదయ మేళనలో మధుర లాలనలో
హృదయ మేళనలో మధుర లాలనలో
వెలిగిపోనీ
రాగ దీపం
వెలిగిపోనీ రాగ దీపం వేయి జన్మలుగా

మనసు పలికే మౌన గీతం
నేడే
మమతలొలికే స్వాతిముత్యం
నీవే

కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ
ఓనమాలు దిద్దనీ
పెదవిపైని ముద్దునై మొదటి తీపి అద్దనీ
మొదటి తీపి
లలిత యామినిలో కలల కౌముదిలో
లలిత యామినిలో కలల కౌముదిలో
కరిగిపోని
కాలమంతా
కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా

మనసు పలికే
మనసు పలికే
మౌనగీతం
మౌనగీతం
మనసు పలికే మౌన గీతం నేడే
మమతలొలికే
మమతలొలికే
స్వాతిముత్యం
స్వాతిముత్యం
మమతలొలికే స్వాతిముత్యం
నీవే
అణువు అణువు ప్రణయ మధువు
అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు



Credits
Writer(s): Ilayaraja, C. Narayan Reddy
Lyrics powered by www.musixmatch.com

Link