Ninne Ninne

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని
కొలువుంచే మంత్రం నీవవని
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనౌతా నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేధనవని

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన దొరవు నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని
కుసుమించే గంధం నేనవని

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాప కలిగిన కైలాశమా
కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంత వెలిగించి
హారతియ్యనా

నిన్నే నిన్నే నిన్నే
ఓ, నిన్నే నిన్నే నిన్నే



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link