Gelupuleni Samaram

గెలుపులేని సమరం జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం

మధురమైన గాయం మరిచిపోదు హృదయం
ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం

గతంలో విహారం, కలల్లోని తీరం,
అదంతా భ్రమంటే, మనస్సంతా మంటే

ఏవో జ్ఞాపకాలు, వెంటాడే క్షణాలు,
దహిస్తుంటే దేహం, వెతుక్కుందా మైకం

అలలుగా పడిలేచే కడలిని అడిగావా
తెలుసా తనకైనా తన కల్లోలం
ఆకశం తాకే ఆశ తీరిందా
తీరని దాహం ఆగిందా

జరిగే మథనంలో, విషమేదో రసమేదో తేలేనా ఎపుడైన ఎన్నాళ్ళైనా
పొగలై సెగలై ఎదలో రగిలే, పగలు రేయి ఒకటై

నరనరాలలోన విషమయింది ప్రేమ
చివరకు మిగిలేది ఇదే ఐతే విధిరాత తప్పించ తరమా



Credits
Writer(s): Mickey J Meyer, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link