Evaro Nenevaro

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా

ఓ చిరుగాలి వస్తావా
ప్రశ్నకు బదులే ఇస్తావా
కన్నుల నీటిని తుడిచేస్తానా నువ్వైనా

ఇది కలయా కలయా మరి నిజమా నిజమా
ఇది కలయే ఐతే ఇకమై కరిగిపోతుందే
ఇది నీడా నీడా మరి వెలుగా వెలుగా
ఇది నీడే ఐతే నిశిలో కలిసిపోతుంది

హో, ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా

నిన్నే వీడి నే తొలిసారి నడుస్తున్నా ఒంటరిగా
నీ వంతు గాలిని నా ఎద నిండా పీలుస్తున్నా ప్రియమర
చెరి సగమై రేయి పగలు ఉంటేనే సృష్టికి అందం
ఒక సగం వేరైపోతే అది శాపం

తియతియ్యని గతముంది
గతమే ఇక మిగిలింది
ఏనాటికి మానదు మానదు నా గాయం

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా

స్వప్నాలలో ఒక సౌందర్యం
తారాడెనే తానెవరు
ఆ మేలి ముసుగును తొలగించేస్తే
ఆ వేషమై అది నువ్వు
మందార పెదవే తెరిచి
మధురంగా నవ్వే విసిరి
వెళుతుంటే ఏమౌతానో ఇకపైనా

తన వైపే చూస్తున్నా తననే గమనిస్తున్నా
చూడలేదు అని చేస్తూ ఉన్న ఒక నటన
చూడలేదు అని చేస్తూ ఉన్న ఒక నటన

ఎవరో ఎవరో నేనెవరో నువ్వే లేని నేనెవరో
నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా

ఓ చిరుగాలి వస్తావా
ప్రశ్నకు బదులే ఇస్తావా
కన్నుల నీటిని తుడిచేస్తానా నువ్వైనా

ఇది కలయా కలయా మరి నిజమా నిజమా
ఇది కలయే ఐతే ఇకమై కరిగిపోతుందే
ఇది నీడా నీడా మరి వెలుగా వెలుగా
ఇది నీడే ఐతే నిశిలో కలిసిపోతుంది



Credits
Writer(s): Chandrabose, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link