Nannedo Syeeamaku

నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ
ఏదేదొ సెయ్యామాకు ఏటి కాడా
ముద్దులెట్టి ముగ్గుల్లో దించమాకు
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింక చిన్నదాన్నిరా
సాకేదొ సెప్పమాకు సందకాడ
సోకంత దాచుకోకు ఆడ ఈడ
అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు
అడ్డుగొడ పెట్టి నన్ను ఆపమాకు
అలవాటు చేసుకోవమ్మో
నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ

కంది చేనుకు షికారుకెలితె కందిరీగె నను కుడితె
కంది చేనుకు షికారుకెలితె కందిరీగె నిన్ను కుడితె
మంట నాలొ మొదలవుతుంటె
మందు నేనె ఇస్తుంటె
పెదవి యెంగిలి పైపైన పూస్తె
బాద తగ్గి బాగుంది అంటూ హాయిగ కనులే మూస్తె
ఏదేదొ సెయ్యమాకు ఆడ ఈడ
నన్నేదొ సెయ్యమాకు అందగాడ
అంతకంటె హాయి వుంది వదులుకోకు
ముందుకొచి ముట్టుకుంటె ముడుచుకోకు
అలవాటు చేసుకోవమ్మూ

చింతపల్లి సంతకు వెళితే చింత పూల చీర కొంటె
చింతపల్లి సంతకు వెళితే చింత పూల చీర కొంటె
కట్టు నీకె కుదరకపోతె
నువ్వు సాయం చెస్తుంటె
చెంగు బొడ్లొ దోపుతు వుంటె
చెంగుమని నువు వులిక్కిపడగా నాలొ వుడుకే పుడితే
సాకెదొ సెప్పమాకు సందెకాడ
సోకంత దాచుకోకు కోక నీడ
పెళ్లి చీర కట్టెదాక రెచ్చిపోకు
పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
అలవాటు చెసుకోవయ్యా
నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link