Rara Venu Gopabala

రార వేణు గోప బాల
రాధిక వచ్చెను నిను చేర

సమంతాకి దిమ్మ తిరిగే సొగసురా
తమన్నాకి కళ్లు తిరిగే తళుకురా
అనుపమ మెహ్రీన్ హన్సిక
అదిరిపడే అందగత్తెరా
కియారా కుల్లుకునే కళ్ళురా
రకుల్-నే రెచ్చగొట్టే ఒళ్ళురా
ఇంతకాలమెక్కడెక్కడుందిరా
గుండె పట్టి గుంజుతుందిరా

ఒంటినిండ తేనెటీగలద్దుకుంటా
గుండెనిండ సూదులెన్నో గుచ్చుకుంటూ
దారినిండ నిప్పులేసి దొర్లుతుంటా
చిన్నారి నీ చిన్న నవ్వు కోసం
గండుచీమ పుట్టలోన నిదురపోతా
కొండచిలువ పొట్టలోకి దూరిపోతా
దండుపాళ్యం జట్టులోకి చేరిపోతా
పిచ్చెక్కే నీ చేతి స్పర్శ కోసం
నూలుపోగంత చోటు కాళ్ళ దగ్గరిచ్చుకుంటే
చుట్టేసుకుంటానే చీరలాగా
ఒక్కసారి కన్ను గొట్టు కమ్మగారి మీద ఒట్టు
నిన్నెత్తుకెళ్తానే దొంగలాగా

పెదవి చూడు ఎర్ర మిరప గుట్టలా
కులుకు చూడు దోర జామ చెట్టురా
చిట్టి గుండె అంటుకుంది చుట్టలా
రాతిరంత నిదర పట్టలా

నువ్వు బద్దకంగ ఒళ్ళు విరుసుకుంటే
నాలో చెప్పలేని ఉప్పెనేదో వస్తదే
కాస్త వంగి వంగి నీళ్ళు తోడుతుంటే
గాలి ఆగి ఆగి గుండె ఆగిపోతదే
వేటకత్తి కులికినట్టు, ఏటి గట్టు నడిచినట్టు,
ఇంతందం ఇన్నాళ్ళూ చూడలేదే
గ్యాసు బండ పెలినట్టు, గూడ్స్ బండి గుద్దినట్టు,
ప్రాణాలే పోతున్నా తప్పులేదే...



Credits
Writer(s): Suresh Banisetti, Gowra Hari
Lyrics powered by www.musixmatch.com

Link