Chinni Padala

చిన్ని పాదాల చినుకమ్మా
స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మా
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
మిన్ను మన్ను ఆనందిచేదెపుడమ్మా
మువ్వై నువ్వు నాలో నవ్వే దెపుడమ్మా

చిన్ని పాదాల చినుకమ్మా
స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మా

అదుపులేని పరుగా ఇది
కదలలేని పదమా ఇది
ఏమోమరి ఈ సంగతి
కలల లయల పిలుపా ఇది
చిలిపి తలపు స్వరమా ఇది
ఏమోమరి యద సవ్వడి
మాటైన రానంత మౌనాలా
ఏ బాషకి రాని గానాలా
మన జంటె లోకంగా మారాలా
మన వెంటే లోకాలు రావాలా
బదులియ్యవా ప్రణయమా

శ్వాస వేణువై సాగినా
వేడి వేసవై రేగినా
భారం నీదే ప్రియ భావమా
ఆశకి ఆయువై చేరినా
కలల వెనకనే దాగినా
తీరం నువ్వే అనురాగమా
దూరాన్ని దూరంగా తరిమేసి
ఏకాంతమే ఏలుతున్నామా
ఊహల్లో కాలాన్ని ఉరివేసి
గాలుల్లో ఊరేగుతున్నామా
తెలిసేనా ఓ ప్రియతమా

చిన్ని పాదాల చినుకమ్మా
స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మా
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
మిన్ను మన్ను ఆనందిచేదెపుడమ్మా
మువ్వై నువ్వు నాలో నవ్వే దెపుడమ్మా

చిన్ని పాదాల చినుకమ్మా (చినుకమ్మా)
స్వాతి ముత్యాలు చిలుకమ్మా (చిలుకమ్మా)
పంచవర్ణాల చిలకమ్మా (చిలకమ్మా)
మంచి ముచ్చట్లు పలుకమ్మా (పలుకమ్మా)



Credits
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link