Neerugari Paripoku

నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో
మారుమూల దాగిపోకు, పిరికి మందు తాగబోకు లే మేలుకో
ఎందుకీ భయం అందుకో జయం
నీడలాగ నీకు తోడు నేనే లేనా
నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే

రూపురేఖలో చురుకైన చూపులో నీవే జాకీ చాన్
కొండరాళ్ళనే నీ కండరాలతో లేపే super man
కీచులాటలు కుంఫూల ఫైటులు రావే ఏం చేస్తాం
ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో పడి చస్తాం
అహ ఎంతవారలైన నీకు చీమ దోమ
అయ్యో ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా
He man లా నువ్వు హుంకరించరా
ఆ పైన నా ప్రాణం హరించరా
వీరస్వర్గమే వరించరా
మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రాను పో
చేతగాని శౌర్యమేల, ఈదలేని లోతులేల హా

పాల పాలుడా పలనాటి బాలుడా ఏదీ నీ ధైర్యం
కదన వీరుడా అసహాయ శూరుడా కానీ ఘనకార్యం
నీకు మొక్కుతా, ఒక మూల నక్కుతా పోరే వద్దంట
బతుకు దక్కితే బలుసాకు మెక్కుతా పోనీ నన్నిట్టా
అహ కీడు నీడ చూసి నీకు భయమా భీమా
చేయలేదు ఇంతవరకు జీవిత భీమా
ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో
అమ్మనాయనో నన్నింక విడిచిపో
జంకు బొంకు లేక నడిచిపో
మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రాను పో
చేతగాని శౌర్యమేల, ఈదలేని లోతులేల నే రాను పో
పాడు రొంపిలో నన్ను దింపకే
ముందు నుయ్యి వెనుక గొయ్యి చావే ఖాయం
నీరుగారి పారిపోకు నీరసాన జారిపోకు లే మేలుకో
మారుమూల దాగిపోకు, పిరికి మందు తాగబోకు లే మేలుకో



Credits
Writer(s): Ilayaraja, Vennelakanti, Sirivennela Sitarama Sastry, Jonnavitthula
Lyrics powered by www.musixmatch.com

Link