Oka Brundavanam

ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

నే సందెవేళ జాబిలి నా గీతమాల ఆమని
నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలక పలుకులే
నే కన్న కలల నీడ నందనం నాలోని వయసు ముగ్ధ మోహనం
ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

నే మనసు పడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే
నే సాగు బాట జాజి పూవులే నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
ఒకే స్వరం సాగేను తీయగ ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం

Credits
Writer(s): Ilaiyaraaja, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link