Bangaram

నా పండూ నా బుజ్జీ నా కన్నా నా నాన్నా
పండూ బుజ్జీ కన్నా నాన్నా బంగారం

బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే
నీ పలుకే వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయాయే
బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే

కాయలైన కనులలోన పూలు పూచే రత్తె రత్తె రత్తె రత్తె
భారమైన కాళ్ళలోన రెక్కలొచ్చే రత్తె రత్తె రత్తె రత్తె
రక్తం బదులు అణువుల్లోనా అమ్రుతమేదో ప్రవహించే
దేహం నుంచి వీధుల్లోకి విద్యుత్తేదో ప్రహవించే
నువ్వుంటే... నా వెంటే... నా జంటే కాలానికే నేను తాళాలు వేస్తానే

బంగారం బంగారం నీకి వేచానే
నా పండూ నా బుజ్జి నా కన్న నా నాన్న

ప్రశ్నలాంటి బ్రతుకులోన బదులు దొరికె రత్తె రత్తె రత్తె రత్తె
పేదలైన ఎదకు ప్రేమ నిధులు దొరికే రత్తె రత్తె రత్తె రత్తె
ఇప్పటికిప్పుడు ఉప్పెనతెచ్చే సంతోషాలే ఎదురొచ్చే
కుప్పలుతెప్పలు స్వర్గాలుండే సామ్రాజ్యాలే కనిపించే
నువ్వుంటే... నా వెంటే... నా జంటే దేవుళ్ళకే నేను వరాలు ఇస్తానే

బంగారం బంగారం నీకై వేచానే
నీ పలుకే వినబడుతుంటే నా చెవులే కనులవుతుంటే
మాటలకే రూపొస్తుంటే నీ ఉనికే కనబడుతుంటే
పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయాయే
బంగారం బంగారం నీకై వేచానే
బంగారం బంగారం నిన్నే చేరానే



Credits
Writer(s): K S Chandra Bose, Gilla Chakradhar
Lyrics powered by www.musixmatch.com

Link