Matrudevobhava

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచీ కనుమూయాలని ఉన్నది
అమ్మా నాన్నా అమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచీ కనుమూయాలని ఉన్నది

అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావనీ
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమనీ
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురనీ
తెలియనైతి తల్లీ
ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయినీ
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా

నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందుననీ
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెననీ
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా

కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే
ఇచ్చాడు క్షమించే హృదయం
మా ఆయువు పొసుకోని నీవు వర్దిల్లు కల కాలం
శతమానం భవతి
శతాయుష్మాం భవ
శతమానం భవతి
శతాయుష్మాం భవ



Credits
Writer(s): M.m. Keeravani, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link