Idhera

ఓ మనిషి

ఓ మహర్షి
కనిపించిందా ఉదయం
ఓ మనిషి
ఓ అన్వేషి
వెలుగైందా హృదయం
ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంతా మటుమాయం అయినది
ఈ ప్రాణం ఈ రోజే మరల ఊపిరి పొంది

తానెవరో కనుగొన్నది
ఇదేరా
ఇదేరా
గెలుపంటే
ఇదేరా

అందిస్తూ పొందావో
బ్రతుకంతా ప్రేమేరా

వదలనిదె నీ స్వార్థం
కనబడునా పరమార్ధం
మనసులను గెలిచేది ప్రేమే కదా

ప్రేమే మానవత్వం
ప్రేమే దైవ తత్వం

జీవించేటి దారే ఇది
ఇదేరా
ఇదేరా
గెలుపంటే ఇదేరా
అందిస్తూ పొందావో

బ్రతుకంతా ప్రేమేరా

యద సడిలో నిజముంది
కను తడిలో నిజముంది
అడుగడుగు గుడి ఉంది ప్రతి మనిషిలో
నివేదించు ప్రాణం
దైవంతో ప్రయాణం
సాగిస్తుంది నీ జీవితం
ఇదేరా
ఇదేరా
గెలుపంటే ఇదేరా

అందిస్తూ పొందావో
బ్రతుకంతా ప్రేమేరా

ఓ మనిషి
ఓ మహర్షి
కనిపించిందా ఉదయం
ఓ మనిషి
ఓ అన్వేషి
వెలుగైందా హృదయం



Credits
Writer(s): Ramajogayya Sastry, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link