Gajje Gallumantuntae

ఝణన ఝణన నాదంలో ఝళిపించిన పాదంలో
జగము జలదరిస్తుంది పెదవి పలకరిస్తుంది

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే
కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లు మంటుంటే
కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

అమరావతి శిల్పంలో
అందమైన కళలున్నాయి
అవి నీలో మిల మిల మెరిసే
అరకన్నుల కలలైనాయి
అమరావతి శిల్పంలో
అందమైన కళలున్నాయి
అవి నీలో మిల మిల మెరిసే
అరకన్నుల కలలైనాయి

నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి
నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి
నీ విరుపుల మెరుపులలో
నీ పదాల పారాణి

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే
కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

తుంగభద్ర తరంగాలలో
సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా
పొంగి పదం పాడిస్తుంది
తుంగభద్ర తరంగాలలో
సంగీతం నీలో వుంది
రంగ రంగ వైభవంగా
పొంగి పదం పాడిస్తుంది

అచ్చ తెలుగు నుడికారంలా
మచ్చలేని మమకారంలా
అచ్చ తెలుగు నుడికారంలా
మచ్చలేని మమకారంలా
వచ్చినదీ కవితా గానం
నీ విచ్చిన ఆరవ ప్రాణం

గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది
గుండె ఝల్లు మంటుంటే
కవిత వెల్లువవుతుంది
గజ్జె ఘల్లు మంటుంటే గుండె ఝల్లు మంటుంది

(దిలీప్ చక్రవర్తి)



Credits
Writer(s): Veturi Murthy, Soma T V, Koteswara Saluri
Lyrics powered by www.musixmatch.com

Link