Koyilamma

కుహు కుహు అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మా
బదులుగ నవ్వొకటివ్వమ్మా

కుహు కుహు అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మా
బదులుగ నవ్వొకటివ్వమ్మా
ఆ నవ్వులే సిరిమల్లెలై
పూయాయిలే నీ పెదవంచులో
ఈ పూలకి ఆరటమే
చేరాలని జడకుచ్చిల్లలో
ఓ ఇంద్రధనుస్సే వర్ణాల వానై
కురుసెను జల జల
చిటపట చినుకులుగా

కూ కూ కూ కూ
కుహు కుహు అని కోయిలమ్మా
తీయగ నిన్నె పిలిచిందమ్మా
కోపం చాలమ్మా
బదులుగ నవ్వొకటివ్వమ్మా

ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం
నీ నవ్వు కోసం
ఓ మెరుపు లేఖే రాయలి

ఈ చల్లగాలి ఓ మల్లెపువ్వై
నిన్నల్లుకుంటూ ఆగాలి
ఆ వాన మేఘం
నీ నవ్వు కోసం
ఓ మెరుపు లేఖే రాయలి
సెలయేరు పైన జలతారు వీణ
పలికెను గల గల
సరిగమ పదనిసలా

కూ కూ కూ కూ
కుహు కుహు అని కోయిలమ్మా
తీయగ నిన్నె పిలిచిందమ్మా
కోపం చాలమ్మా
బదులుగ నవ్వొకటివ్వమ్మా

నీలాల నింగి చుక్కల్ని తెచ్చి
నక్షత్ర మాలే వెయ్యాలి
నీ కంటి నీరు వర్షించకుండా
దొస్సిళ్ల గొడుగే పట్టాలి

నీలాల నింగి చుక్కలని తెచ్చి
నక్షత్ర మాలే వెయ్యాలి
నీ కంటి నీరు వర్షించకుండా
దొసిళ్ల గొడుగే పట్టాలి
ఏ కష్టమైనా ఉంటాను తోడై
తడపడు అడుగున
జతపడి నేనున్నా

కూ కూ కూ కూ
కుహు కుహు అని కోయిలమ్మా
తీయగ నిన్నే పిలిచిందమ్మా
కోపం చాలమ్మా
బదులుగ నవ్వొకటివ్వమ్మా



Credits
Writer(s): Anup Rubens, Lakshmi Bhupal
Lyrics powered by www.musixmatch.com

Link