Regumullole

Man is moon
Moonlight is roma
Both are loving together
చందమామ చందమామ

రేగుముల్లోలే నాటు సిన్నాది
బొడ్డు మల్లెను సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా (అహ)
ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను
కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండ
ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా
అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బ
ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండ
Come on, come on, come on baby
Shake your body baby
Come on, come on, come on baby
Make me rock
Come on, come on, come on baby
Save the song baby
Come on, come on, come on baby
Make you rock

కోనేటి నీళ్ళల్లో వంగిందిరో
కుండల్లె నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో, నను తడిపిందిరో
ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో
అది జాంపండులా నను తింటుందిరో అచ్చా
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి ఛా!
తన జడను విసిరి వయ్యారి ఆఁహాఁ
చిరు నగవు చిలికి ఒకసారి అబ్బో!
కొస పెదవి కొరికి ప్రతిసారి
యహ మీసాలు గుచ్చకుండ
ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు

(మల మల మల మల మల్లెలా)
(మల మల మల మల వస్తివా)
(మల మల మల మల మళ్ళరా)
(మల మల మల మల వస్తివా)

ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోని సై అంటె రో
దాసోహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై
పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే
తెగ కులుకులొలికి ఆ సిలక
మీసాలు గుచ్చకుండ ఒసేయ్ భామ ముద్దాడలేనే నేను
కంది పూవల్లె ముట్టుకుంటాను
అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండ ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
ముద్దాడుతావా అంది



Credits
Writer(s): Suddhala Ashok Teja, K.m.radha Krishnan
Lyrics powered by www.musixmatch.com

Link