Sainika

సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కను పాప కంటి నిండుగా నిదురపోదురా (నిదురపోదురా)
నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుటా ఎగురుతుందిరా
పై కెగురుతుందిరా
ఇల్లే India दिल्ले India నీ తల్లే India
తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవకా ఓ సైనికా
పనిలో పరుగే తీరిక ఓ సైనికా
ప్రాణం అంత తేలిక ఓ సైనికా
పోరాటం నీకో వేడుకా ఓ సైనికా

దేహంతో వెలిపోదీ కథ
దేశంలా మిగిలుంటుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం
పస్తులు లెక్క పెట్టవే ఓ సైనికా
పుస్తెలు లెక్క పెట్టవే ఓ సైనికా
గస్తీ దుస్తుల సాక్షిగా ఓ సైనికా
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనికా

బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని, బలమగు భక్తుడనీ
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి
ఇల్లే India दिल्ले India
ఇల్లే India दिल्ले India నీ తల్లే India
తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండే భాస్వరం ఓ సైనికా
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనికా
బతుకే వందేమాతరం ఓ సైనికా
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనికా



Credits
Writer(s): Vishal Dadlani, Shekhar Hasmukh Ravjiani, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link