Tella Cheeraku

తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయని సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై
మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో

వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతనవ్వాలి పువ్వంత కావాలి
పండించుకోవాలి ఈ బంధమే
నీ తోడు కావాలి, నే తోడుకోవాలి నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లి సూరీడు ఆకాశంలో నిలిచిన సొగసులా
తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో

కార్తీకం హ కలిసి వస్తే
నీ పరువం అడుగుతున్నా
హేమంతం హ కరుగుతుంటే
నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘ రాగాలు పలికాయి నా స్వప్న సంగీతమే
ఈ చైత్ర మాసాన చిరు నవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నా కోసమే
గిలి గింతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన
తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయని సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై
తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో

Credits
Writer(s): Veturi, Jonnavitthula, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link