Maa Logililo

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికి మా కంటికి
మణి దీపం నీ రూపం
ప్రేమకు ప్రతి రూపం
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

రాముడు అడవికి వెళ్లేనా
నువ్వే అన్నై ఉండుంటే
ఏసు శిలువ మోసేనా
నీకే తమ్ముడు అయ్యుంటే
అమ్మంటూ లేకున్నా జన్మాంత
జన్మంతా జరిగేనులే
అన్నంటూ లేకుంటే
క్షణమైనా యుగమవునులే
తమకున్నదొక్కన్నమ్మవై
కడుపున మము దాచి
కాచిన దైవమా
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

ఇంతటి చక్కని బంధాన్ని
కాలం ఆగి చూసేను
రాత రాయు ఆ బ్రహ్మ
రాయుట ఆపి మురిసేను
తపమేమి చేశామో
తమ్ముళ్ళం అయ్యాములే
తన బతుకే మా మెతుకై
తనయులమే అయ్యాములే
మా దేవుడు మాకుండగా
మరి మాకిక లోటేది
కలతకు చోటేది

మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికి మా కంటికి
మణి దీపం నీ రూపం
ప్రేమకు ప్రతి రూపం
మా లోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే



Credits
Writer(s): Sai Sri Harsha, S.a.raj Kumar
Lyrics powered by www.musixmatch.com

Link