Aatala Paatala

జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది
మొదటి ప్రేమ
మొదటి ముద్దు
మొదటి గెలుపు
ఇలా ముప్పై సంవత్సరాల జీవితంలో
మొత్తానికి ముప్పై నిముషాలు మాత్రమే జీవించమని చెపుకోగలం
అందులోను ముఖ్యమైన ఘట్టం తండ్రిగాన, తల్లిగానో మారె సమయం
పుట్టిన బిడ్డను మొట్టమొదటి సారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం
ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం
పెళ్లికానివాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో
మీ అమ్మ నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందొ అడిగి చూడండి
మాటలో దొరక్క అల్లాడి పోతారు
ఈ పాత వినిపించండి
'ఆహ దే ఇదే' అని అంటారు

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా
మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా

అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే
మాధురమౌ భావాలేవో మోగే లోలోనా
పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే
ఉరకలే పదులై వేలై పొంగే నాలోనా
లాలిపాటే నేనై లాల పోసేవాణ్ణై
నాన్ననై నింపనా లేత హృదయానా

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా

ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు
అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం
క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనానా

మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా

Credits
Writer(s): Vidya Sagar, Ananth Sriram
Lyrics powered by www.musixmatch.com

Link