Itu Itu Ani Chitikelu Evvarivo

(తోం తోం తన తోం తోం తన)
(తోం తోం తన తోం తన తోం తన)
(తోం తోం తన తోం తోం తన)
(తోం తోం తన తోం తన తోం తన)
(తోం తోం తన తోం తోం తన)
(తోం తోం తన తోం తన తోం తన)
(తోం తోం తన తోం తోం తన)
(తోం తోం తన తోం తన తోం తన)
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో
సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో
(తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన)
(తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన)

ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారైందోయ్ సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచివెళ్ళిపోదా
తనోటి ఉందని మనం ఏలాగ గమనించం గనక
కలగంటున్నా మెలకువలో ఉన్నాం కదా
మనదరికెవరు వస్తారు కదిలించగా
ఉషస్సెలా ఉదయిస్తుందో నిషీదెలా ఎటుపోతుందో
నిదర ఎపుడు నిదరోతుందో
మొదలు ఎపుడు మొదలౌతుందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో

పమగరి సారి స స స స రి
ని గ గ రి గ ద మ ద
పమగరి సారి స స స స రి
ని గ గ రి గ ద మ ద

పెదాల మీదుగా అదేమీ గల గల పదాల మాదిరిగా
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా
ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచభాష కదా
ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటవుండదుగా
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా
వినబోతున్న సన్నాయి మేళాలుగా
ఓ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో
(తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన)
(తోం తోం తన తోం తోం తన తోం తోం తన తోం తన తోం తన)

Credits
Writer(s): Seetarama Sastry, Bhatt Chirrantan
Lyrics powered by www.musixmatch.com

Link