Ammayi Bagundi

అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవా
మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవా
గుండె లోపల ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ
కంటిపాపలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదేలా ఓ ఓ
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవా

ఎవ్వరిది యవ్వన వీణ
రువ్వినది నవ్వుల వాన మైన, గుండెలోన
మాటలకి అందని జాణ
అందములో అప్సరసేనా అవునా, అందుకోన
ఆమె నవ్వే పాడుతోంది మౌన సంగీతం
కాలి మువ్వైమోగుతోంది ప్రేమ సంకేతం
ఎటు చూసినా అటు వైపునే ఎదురయ్యే ఆ రూపం
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవా
మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవా

చెప్పకనే చెప్పెను ప్రాయం
ఎప్పటికీ తీరని దాహం మొహం
వింత మొహం
గుప్పిటలో దాగని కాలం
గుప్పుమని ఆశల తీరం దూరం, ఎంత దూరం ఓ ఓ
ఆమెతోనే చేయమంది జన్మలో స్నేహం
ఆమెతోనే సాగమంది తోడుగా ప్రాణం
సందెవేళలో చల్లగాలిలా నన్ను చేరే సంతోషం
అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవా
మందారంలా ఉంది మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవా

గుండె లోపల ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ
కంటిపాపలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదేలా



Credits
Writer(s): Kula Sekhar, M.m. Srilekha
Lyrics powered by www.musixmatch.com

Link