Marala Telupuna

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున మధురోహల పరిమళాన్ని
ఎదలోయల దాచుకున మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా

విరబూసిన వెన్నెలలో తెర తీసిన బీడియాలనీ
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బీడియాలనీ
అనువనువు అల్లుకున్న అంతులేని విరహాలని
అనువనువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదుర పోని కన్నులలో పవలించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా

నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి
నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయ చూసి
మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే
మాట రాని మౌనమేదో పెదవి మీద ఒదిగి పోయే
ఒక క్షణమే ఆవేదన మరో క్షణమే ఆరాధనా
తెరియ రాక తెలుప లేక మనసు పడే మధుర బాధ

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా



Credits
Writer(s): Vandemataram Srinivas, Bhuvana Chandra
Lyrics powered by www.musixmatch.com

Link