Vaye Janmalu

వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకే
కోటి దీపాల వెలుగు నీవే
తెలుసు నా కంటికే
నిను దాచే ఈ నిశి
నిలిచేనా ప్రేయసి
నలువైపులా నల్లని చీకట్లే ఎదురొస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతూ ఉన్నా
కనుపాపకి ఉప్పని కన్నీళ్ళే తెర వేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా
వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకే

గాలితో నువ్వు పంపిన వలపు ఊసేమిటో
పూలలో నువ్వు నింపిన తీపి తలపేమిటో
నిన్న నా కలను చేరలేదని
నమ్మదా చెలి నీ మౌనం
నా శ్వాసతో రగిలే గాలులతో
నిను వెతికిస్తున్నా
నా ప్రేమను పూల సువాసనతో నీకందిస్తున్నా
ఎద సవ్వడులే ఆ మువ్వలుగా
ఎగరేస్తూ ఉన్నా
అవి నిన్నే చూడాలి నువ్వెక్కడ ఉన్నా
వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకే

ఆశగా ఉంది నెచ్చెలి కలుసుకోవాలని
కోవెలై ఉంది కౌగిలి దేవి రావాలని
నీవు కలవని కలవు కాదని
రుజువు చేయనీ అనురాగం
నను నేనే శిలగా మోస్తున్నా
ఎద బరువైపోగా
చిరునవ్వుల్నే వెలి వేస్తున్నా
నిను చూసేదాకా
ప్రతి రక్త కణం వెలిగిస్తున్నా
పెను జ్వాలైపోగా
ఎడబాటు పొరబాటు కరిగించే దాకా
వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకే
కోటి దీపాల వెలుగు నీవే
తెలుసు నా కంటికే
నిను దాచే ఈ నిశి
నిలిచేనా ప్రేయసి
నలువైపులా నల్లని చీకట్లే ఎదురొస్తూ ఉన్నా
పరుగాపని పాదం దూరంతో పోరాడుతూ ఉన్నా
కనుపాపకి ఉప్పని కన్నీరే తెర వేస్తూ ఉన్నా
ప్రతి నిమిషం నీ వైపే పయనిస్తూ ఉన్నా

వేయి జన్మాల చెలిమి నీవే
తెలుసు నా గుండెకే



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Shivashankar
Lyrics powered by www.musixmatch.com

Link