Ede Naa Palletooru

(ఓరరే ఓరరే ఓరరే ఓరరే)
(ఓరరే ఓరరే ఓరరే ఓరరే)
(ఓరరే ఓరరే ఓరరే ఓరరే ఓరోరే)
(ఓరోరే ఓరరే ఓరోరే)
(ఓరోరే ఓరరే ఓరోరే)
ఇదే నా పల్లెటూరు
ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట
రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు
కడిగే సీతమ్మ పాదాలు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్
మనసంతా హాయ్ హాయ్ హాయ్

ఇదే నా పల్లెటూరు
ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట
రాములోరి దీవెనంటా

(రేరోరి రెరేరో రేరోరి రెరేరో)
(రేరోరి రెరేరో రేరో రేరో)
రామునికి బాణమొకటి
భార్య సీతమ్మ ఒకటి
ఆ రాముడంటి కొడకు
ఇంటింటా ఉంటే ఒకడు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్
మనసంతా జాయ్ జాయ్ జాయ్

ఒక దేవుడే తనకు
ఒక ధర్మమే తనది
హనుమంతుడే మనకు ఆదర్శమే అయితే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్
మనసంతా హాయ్ హాయ్ హాయ్

ఇదే నా పల్లెటూరు
ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట
రాములోరి దీవెనంటా
తొలకరిలో వాన చుక్క
రుచి చూస్తే తేనె చుక్క
భూమిపై మోము పైన
చిన్ని గరిక నవ్వుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్
మనసంతా జాయ్ జాయ్ జాయ్

ఆలమంద పాల ధార
మీటుతున్నదో సితార
కడుపునిండా పాలు తాగి
లేగదూడలాడుతుంటే
ఊరంతా హాయ్ హాయ్ హాయ్
మనసంతా హాయ్ హాయ్ హాయ్

ఇదే నా పల్లెటూరు
ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట
రాములోరి దీవెనంటా
తల్లీ గోదావరి నీళ్లు
కడిగే సీతమ్మ పాదాలు
ఊరంతా హాయ్ హాయ్ హాయ్
మనసంతా హాయ్ హాయ్ హాయ్

ఇదే నా పల్లెటూరు
ఇదే నా తల్లిగారు
మా ఊరి పాడిపంట
రాములోరి దీవెనంటా



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link