Aa Ghaghananiki Meghame Thodu

ఆ గగనానికి మేఘమే తోడు
నా గమనానికి మౌనమే తోడు
వెలుగులెన్నో నిండినా, చీకటే తోడు
వేల మందిలో నిలిచినా, శూన్యమే తోడు
నడిచి నడిచి వెతికా నన్ను నేడు
గమ్యమెరుగని దారిలో నేను ఏకాకి
నేను ఏకాకి

ఆ గగనానికి మేఘమే తోడు

నిన్నటి నీడతో నన్ను వెరవని
రేపటి ఆశలే నాకు చూపవని
ఈ లోకాన్నిలా చదువుతూ పోనీ

కాలము పాఠమే నేర్పినది ఇపుడు
జీవితం నాకిక నేస్తమయేదెపుడు?

ఆ గగనానికి మేఘమే తోడు
నా గమనానికి మౌనమే తోడు
వెలుగులెన్నో నిండినా, చీకటే తోడు
వేల మందిలో నిలిచినా, శూన్యమే తోడు
నడిచి నడిచి వెతికా నన్ను నేడు
గమ్యమెరుగని దారిలో నేను ఏకాకి
నేను ఏకాకి



Credits
Lyrics powered by www.musixmatch.com

Link