Pada Padamani

పలికే రాగాలే ఎన్నో విన్నా
నీ ఎదలో నా ఊసే చిలిపిగా
పెరిగే ఆశలే కంటూ ఉన్నా
నీ ఊహే అల్లేసే హాయిగా

మదిలో గొడవేంటో గమ్మత్తుగా
నీ తలపే తారాడే లోలో ఇలా

పద పదమని తరిమెను మది
నీవైపే ఇక వస్తున్నా
కలవరమై పరవశమై

నాలో నాకే తెలియని పరుగులు చూస్తున్నా
నాతో నేనే ఉన్నా లేననిపిస్తున్నా
ఏమిటీ వైఖరి పోకిరి, సరికొత్తగా ఉన్నది
ఇంతగా ఈ తుంటరి అల్లరి నీవల్లే మొదలైనది

పద పదమని తరిమెను మది
నీవైపే ఇక వస్తున్నా
కలవరమై పరవశమై

నిన్న మొన్న అన్నీ ఉన్నా ఈనాడే
నీతో చూస్తున్నా ఎన్నో ఆనందాలే
మతి చెడగొట్టే మగసిరులన్నీ నను కవ్విస్తే
మన్మధతాపం నను మరుపిస్తూ, వస్తున్నా

పద పదమని తరిమెను మది
నీవైపే ఇక వస్తున్నా
కలవరమై పరవశమై

పలికే రాగాలే ఎన్నో విన్నా
నీ ఎదలో నా ఊసే చిలిపిగా
పెరిగే ఆశలే కంటూ ఉన్నా
నీ ఊహే అల్లేసే హాయిగా



Credits
Writer(s): Shreshta, P.a. Deepak
Lyrics powered by www.musixmatch.com

Link