Andam Hindolam - Remix

అందం హిందోళం అదరం తాంబూలం
అసలే చలికాలం రగిలే సుమబాణం
సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా
ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా
అందనిది అందాలనిది
అందగనే సందేళకది
నా శృతి మించెను నీ లయ పెంచెనులే

చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో
తొలిగా ముచ్చమటారని ఉక్కిరి గుంటలలో
దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళే కాయగా
పైటమ్మీ మానుకుంది పరువాలె దాయగా
ఉసిగొలిపే రూచితెలిపే తొలివలపే
మోటిమలపై మొఖమేరుపై జతకలిపే
తీయనిది తెర తీయనిది
తీరా అది చేజిక్కినది
మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే

అందం హిందోళం
అదరం తాంబూలం
అసలే చలికాలం
రగిలే సుమబాణం

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో
వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో
గిచ్చుళ్ళ వీణ మీదా మృదులెన్నో పాడగా
చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా
తొలి ఉడుకే వొడి దుడుకై చలి చినుకై
పెనవేసి పెదవడిగే ప్రేమలకు
ఇచ్చినది కడునచ్చినది
రేపంటే నన్ను గిచ్చినది
అక్కరకొచ్చిన చక్కని సోయగమే

అందం హిందోళం
అదరం తాంబూలం
అసలే చలికాలం
రగిలే సుమబాణం



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, S R Koteswara Rao, T. V. Somaraju, Sai Kartheek
Lyrics powered by www.musixmatch.com

Link