Neeli Mabbu Nuragalo

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
Bathtub-u shower-uలో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే, no, no
అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
Bathtub-u shower-uలో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే, no, no
అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా

హొమగుండమయ్యె భామ కౌగిలి
కవ్వింతలే కేరింతలై జ్వలించగా
ప్రేమ కోటి రాసి పెరిగె ఆకలి
ముద్దెంగిలి తీపెక్కువై నోరూరగా
ఎడతెగనీ తపనా
ఎడమవగా తగునా
వగరు వయసు అడుగు ముడుపులన్నీ తడిమి చూసి తపన పెంచనా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
Bathtub-u shower-uలో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే, no, no

ఊసులాడుకున్న రాసలీలలో
తెల్లారని ఉయ్యాలలే ఊపేసుకో
ఊపిరంటుకున్న తీపి మంటలో
వేన్నీళ్ళకే చన్నీళ్ళుగా వాటేసుకో
కథ ముదిరే మదనా
లయలివిగో లలనా
జలక జతుల కలికి కులుకులన్నీ చిలుక చుట్టి పులకరించనా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో
Bathtub-u shower-uలో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే no, no
అకస్మాత్తుగా అదే మత్తుగా రహస్యములు చే చూడగా

నీలి మబ్బు నురగలో కాలు జారిపడ్డ వేళ ఎన్ని దెబ్బలో ఏమో... ఏమో
Bathtub-u shower-uలో ఈడు ఉలికిపడ్డ వేళ నీకు నిద్దరే no, no... no, no
అకస్మాత్తుగా అదే మత్తుగా సుఖం ఎక్కడో పుట్టగా

Credits
Writer(s): M.m. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link