Chelimeeda

చెలి మీద చిటికెడు దయ రాదా అసలే చలి కాదా మనవేదో వినరాదా
వినలేదా అరెరె అనలేదా అయినా సరిపోదా ఎదురొస్తే మరియాద
ఊ ఇంతేనా మాటలతో పోయే మంటేనా
ఈ కంగారేం కళ్యాణం కోసం కయ్యాలా
... మనవేదో వినరాదా ... ఎదురొస్తే మరియాద

ఇంత కాలం అందలేదా పరి పరి విధముల పరువము పంపిన లేఖలు
అంత దూరం లేను కదా సూటిగ అడగక దేనికి తికమక సైగలు

ఆశ లేకేం బోలెడంత అవసరమిది అని తెగబడి అడుగుట తేలికా
దాచుకుంటే ఊరుకుందా పిడికెడు నడుముకు సొగసులు బరువై తూలకా
నీతి బోధ మాను చెంత చేరినాను చేతనైన సాయమియ్యవా
ఏమి లాభమంట లేని పోని చింత మానవేమి ఎంత పోరినా
పాల ముంచినా నీట ముంచినా నీదేగా భారము

చెలి మీద చిటికెడు దయ రాదా అసలే చలి కాదా మనవేదో వినరాదా
వినలేదా అరెరె అనలేదా అయినా సరిపోదా ఎదురొస్తే మరియాద
ఊ ఇంతేనా మాటలతో పోయే మంటేనా
ఈ కంగారేం కళ్యాణం కోసం కయ్యాలా



Credits
Writer(s): Siri Vennela Seetha Ramasasthry, Sri
Lyrics powered by www.musixmatch.com

Link