Anandam

ఆనందం అణుబాంబై పేలిందే నా గుండెల్లో
అట్లాంటిక్ పొంగిందే ఉప్పొంగే ఊపిరిలో
హరివిల్లే గీతల్లె వాలిందే అరచేతుల్లో
బీథోవెన్ సంగీతం వింటున్నా గాలుల్లో
One only అనుభవం ఇది నా lifetime జ్ఞాపకం
చెలియా నీ తొలి దర్శనం ఓహో
ఎపుడూ చూడని సంబరం చవిచూస్తున్నా ఈ క్షణం
పులకించింది జీవితం ఓ ఓ
నీ కొరకే నీ కొరకే వెతికింది హృదయం
నీ వెలుగే వేకువలా వెలిగింది సమయం
ఆనందం అణుబాంబై పేలిందే నా గుండెల్లో
అట్లాంటిక్ పొంగిందే ఉప్పొంగే ఊపిరిలో
హరివిల్లే గీతల్లె వాలిందే అరచేతుల్లో
బీథోవెన్ సంగీతం వింటున్నా గాలుల్లో

ఎవరో ఎవరో నువ్వెవరో ఏ పేరైనా
నేనెపుడో నువ్వే నా ప్రేమవు అనుకున్నా

మెరుపై మెరిసి కనుమరుగైపోతూ ఉన్నా
నా పరుగూ పయనం నువ్వేనని వస్తున్నా
పుట్టిందే నువ్వు చెలి నా కోసం
వెయ్యేళ్ళు వేచి ఉంటా నీ కోసం
ఏనాటికైనా నువ్వే నా సొంతం
ఏ జన్మకైనా నేనే నీ బంధం
నీ కొరకే నీ కొరకే వెతికింది హృదయం
నీ వెలుగే వేకువలా వెలిగింది సమయం

వెళుతూ వెళుతూ నువ్ విసిరిన చూపులు తాకి
ఈ మనసే ఇలా ఊహల్లో తేలిందే

పగలు, దిగులు మరిపించే మాయే నీది
నీ జతలో అడుగై నడవాలనిపిస్తోందే
ఏ వైపు నుండి నన్ను చూసావో
నా గుండె గంట ఎలా విన్నావో
దూరాలు దాటి నన్నే చేరావు
నా కల, నిజం రెండూ నువ్వైయ్యావు
నీ కొరకే నీ కొరకే వెతికింది హృదయం
నీ వెలుగే హే వేకువలా వెలిగింది సమయం



Credits
Writer(s): Ramajogayya Sastry, Mantra Anand
Lyrics powered by www.musixmatch.com

Link