Muddhulake

ముద్దులకే ముద్దొచ్చే ముద్దుల గుమ్మా
ముద్దులన్నీ మూట కట్టవే
సిగ్గులకే సిగ్గోచ్చే సిగ్గుల కొమ్మా
సిగ్గులన్నీ దాచిపెట్టవే
అరెరే తళుకు బెళుకు
దుడుకు వయసు
మురిసి మురిసి మెరిసె మిల మిల
భళారీ బిరుకు బిరుకు
చిలిపి మనసు ఉరక లేసే
మధుర వరదలా మరదలా
నీ ఎద మలుపులు చేరే సూత్రం
నీ మెడ మెరుపుల మంగళ సూత్రం
మబ్బుల్ని దించి పందిల్లే వేసి
చేస్తానే నీ పెళ్లి అది సరే మరి
మబ్బుల్లో నుంచి వానొచ్చెనంటే
ఔతుంది మన పెళ్లి
వారెవ్వా... ఇంటి పేరు మారిపోయే
ఈ వేడుకేదో వేచి ఉందలా
ఒహొహో... ఒకరి పేరు ఒకరు చెప్పు
ముచ్చటేదో చేరుతుందలా పెళ్లిలా
నవ వధువుగ నిను చూసిన పూటా
మా కనులకు చిరు చినుకుల పాటా
(తకధిమి తకిట తకిట)
(తక తకధిమి తకిట తకిట)
(తకధిమి తకిట తకిట)
(తకిట తకిట త)
ఏడడుగులేసి కార్యాలు చేసి
జంటల్లే వెళ్ళండి
చల్ చలో మని మూడో నెల దాటి
ముగ్గురిగా మారి ముచ్చటగా రారండి
ఓలమ్మో... పడుచు దనపు గడుసు ధనము
తోక ముడిచి పరుగులే ఇలా
అమ్మమ్మో... ఆడతనము అమ్మతనము
అణువు అణువు తీరులే
అలా మరదలా
నీ ముసి ముసి లోగిలి లోన
మా రేపటి కల చూపవె జాణా హేయ్

ముద్దులకే ముద్దొచ్చే ముద్దుల గుమ్మా
ముద్దులన్నీ మూట కట్టవే
సిగ్గులకే సిగ్గోచ్చే సిగ్గుల కొమ్మా
సిగ్గులన్నీ దాచిపెట్టవే
అరెరే తళుకు బెళుకు
దుడుకు వయసు
మురిసి మురిసి మెరిసె మిల మిల
భళారీ బిరుకు బిరుకు
చిలిపి మనసు ఉరక లేసే
మధుర వరదలా మరదలా
నీ ఎద మలుపులు చేరే సూత్రం
నీ మెడ మెరుపుల మంగళ సూత్రం
ఒహొహో ఆహాహా లాలాలా రారారా
ఒహొహో ఆహాహా లాలాలా రారారా



Credits
Writer(s): Raj-koti, K. Vishwanath
Lyrics powered by www.musixmatch.com

Link