O Bharatha Verullara

అమ్మా
అమ్మా
అమ్మా భారతమాతా
మేమంతా నీ బిడ్డలమమ్మా
ఈ దేశం మన కుటుంబమమ్మా
మన అందరి రక్షణా
భారత వీరులేనమ్మా
ఓ భారత వీరుల్లారా
ఓ దివ్య జోతుల్లారా
మీరే మా అందరి భాగ్యం
ఈ దేశం మరువదు త్యాగం
ఈ దేశం మరువదు నీ త్యాగం
ఓ భారత వీరుల్లారా
ఓ దివ్య జోతుల్లారా

మన మాడుతు పాడుతువుంటే
మరి హాయిగ బ్రతికేస్తుంటే
సరిహద్దున వారున్నారు పోరాటమే చేస్తున్నారు
ఆ సైనికుడే లేకుంటే
స్వాతంత్య్రం ఉందా మనకు
ఆ సైనికుడే లేకుంటే
సుఖ శాంతులెక్కడ మనకు
ఓ భారత వీరుల్లారా
ఓ దివ్య జోతుల్లారా

తమ వారే సైనికులైతే
సమరానికి సై అని వెళితే
ఆ తండ్రికి తీరని బాద
తనయునికొక దీవెన కాదా
బ్రతుకంతా నేరము కాదా
ఆ త్యాగాన్ని స్మరించకుంటే
ఇది తీరని ఋణమైపోదా
వారి పాదాలు పూజించకుంటే
ఓ భారత వీరుల్లారా
ఓ దివ్య జోతుల్లారా
ఈ వీర మాటలే లేకుంటే
ఆ వీరులెవ్యరూ మనకు
ఈ వీర తిలకమే దిద్దకపోతే
విజయమెక్కడిది మనకు
ఈ దేశానికి నేనేనమ్మా
ప్రధమ వనితను
ఇప్పటికీ జవానులే ప్రధమ పౌరులు
జాతీయ పతాకమా నీకు వందనం
ఓ వీర వనితల్లారా మీకు వందనం
జాతీయ పతాకమే తెలిపెను
మీకు వందనం

వందనం జైహిన్ జైహిన్
జైహిన్ జైహిన్ జైహిన్ జైహిన్
జైహిన్ జైహిన్



Credits
Writer(s): Kumar, Indraprasad
Lyrics powered by www.musixmatch.com

Link