Yentha Sakkagunnave (From "Rangasthalam")

యేరుసెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నవె లచ్చిమి ఎంత సక్కగున్నవె
సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నవె లచ్చిమి ఎంత సక్కగున్నవె
మల్లెపూల మధ్య ముద్దబంతి లాగ ఎంత సక్కగున్నవె
ముత్తయిదువమెళ్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నవె

సుక్కలసీర కట్టుకున్న యెన్నెల లాగ ఎంత సక్కగున్నవె
యేరుసెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నవె లచ్చిమి ఎంత సక్కగున్నవె
సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నవె లచ్చిమి ఎంత సక్కగున్నవె

ఓ రెండు కాళ్ల సినుకువి నువ్వు
గుండె సెర్లో దూకేసినావు
అలల మూటలిప్పేసినావు
ఎంత సక్కగున్నవె లచ్చిమి ఎంత సక్కగున్నవె
మబ్బులేని మెరుపువి నువ్వు నేలమీద నడిసేసినావు నన్ను నింగి సేసేసినావు
ఎంత సక్కగున్నవె లచ్చిమీ ఎంత సక్కగున్నవె

సెరుకుముక్క నువ్వు కొరికి తింటా వుంటే ఎంత సక్కగున్నవె
సెరుకు గడకే తీపి రుసి తెలిపినావె ఎంత సక్కగున్నవె
తిరునాళ్లలో తప్పి ఏడ్చేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి చిరునవ్వులాగ
ఎంత సక్కగున్నవె లచ్చిమీ ఎంత సక్కగున్నవె
గాలి పల్లకిలో ఎంకి పాటలాగ ఎంకి పాటలోన తెలుగు మాటలాగ

ఎంత సక్కగున్నవె లచ్చిమి ఎంత సక్కగున్నవె

కడవ నువ్వు నడుమన బెట్టి
కట్టమీద నడిసొత్తావుంటే
సంద్రం నీ సంకెక్కినట్లు

ఎంత సక్కగున్నవె లచ్చిమీ ఎంత సక్కగున్నవె
కట్టెల మోపు తలకెత్తుకుని అడుగులోన అడుగేత్తావుంటే అడవి నీకు గొడుగట్టినట్టు
ఎంత సక్కగున్నవె లచ్చిమీ ఎంత సక్కగున్నవె
బురదసేలో వరి నాటుయేత్తావుంటే ఎంత సక్కగున్నవె
భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నవె
యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవె
సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామ లాగ ఎంత సక్కగున్నవె లచ్చిమి ఎంత సక్కగున్నవె



Credits
Writer(s): G. Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link