Rayyi Rayyi Mantu

గా రిగరి సానిస పని మప
పా మపమ గాపమ
సగస గసనీ గసనీప
సాసనీ పనీ నీనిపా మపా గమగమ మపమప

రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
సాగ సాగ రీసనీప
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో
సాగ సాగ మాపమాగ
నీలాకాశం ఎంత దూరమున్నా
ఎగిరామంటే అందదా
ఊహాలోకం ఎక్కడెక్కడున్నా
పిలిచామంటే నిజంగా నిజం కాదా
రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో
సనిప రిసని మగరిస సరిగమ పమగరి సని
సనిప రిసని మగరిస సరిగమ పమద
పదప మపమ గమగరి రిమగరి నిరి సనిప
పదప మపమ గమగరి రిగమ పదామప
ఒక్క అడుగైనా వేసి చూడందే
వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చెయ్యందే
నిదుర పోనంటే గెలుపు ఖాయమే
స్వేచ్ఛ అంటే అర్థం ఏ గువ్వపిల్లో కాదు
కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోడమే
రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో

దారి చూపించే వెలుగు వెంటుంటే
కారుచీకట్లో ఎన్నెన్ని కాంతులో
బొమ్మ గీయించే కుంచె తోడుంటే
రేయిలో సైతం ఎన్నెన్ని రంగులో
చెలిమి అంటే అర్ధం పరిచయాలు కాదు
తోడునీడవ్వాలి నడకలో పరుగులో
రయ్యిరయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ
వచ్చి వాలెనే మనస్సు సొంత గూటిలో
ఘల్లుఘల్లుమంటూ గుండె ఝల్లుమంటూ
అడుగులేసెనే స్వరాల కొత్త బాటలో
పనిపస పనిపస పనిప సరిగ మగరిస
పనిపరి పనిపరి పనిప రిగమ పమగరి
సరిగమ సరిగమ సరిగమ మపదనిద పాపమ



Credits
Writer(s): Devi Sri Prasad, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link